Lyrics: Tanikella Bharani Singer: K.J.Yesudas
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ నీకు అమ్మ తోడు
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గద జననాలు
ఆట గద మరణాలు
మధ్యలో ప్రణయాలు
ఆట నీకు
ఆట గద సొంతాలు
ఆట గద పంతాలు -2
ఆట గద అంతాలు
ఆట నీకు
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ నీకు అమ్మ తోడు
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా నలుపు
ఆట గదరా తెలుపు
నలుపు తెలుపుల గెలుపు
ఆట నీకు
ఆట గదరా మన్ను
ఆట గదరా మిన్ను - 2
మిత్యలో ఉంచి ఆడేవు నన్ను
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ నీకు అమ్మ తోడు
ఆట గదరా శివ ఆట గద కేశవా