Literature | Janapadalu | Bandenaka Bandi Katti

బండెనక బండి కట్టి

పదహారు బండ్లు కట్టి

ఏ బండ్లో పోతావ్‌ కొడకో

నైజాము సర్కరోడా

నాజీల మించినవురో

నైజాము సర్కారోడా



పోలీసు మిల్టీ రెండు

బలవంతులా అనుకోని

నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో

నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో

మా పల్లెలు దోస్తివి కొడుకో

నైజాము సర్కారోడా



స్త్రీపురుషులంతా కలిసీ

పిల్లలమంతా కలిసీ

వడిశెల్ల రాళ్ళు నింపీ

వడివడికొట్టితేను

కారాపు నీళ్ళు తెచ్చీ

కళ్ళల్లో చల్లితేను

నీ మిల్టి పారిపోయెరో..

నీ మిల్టి పారిపోయెరో..

నైజాము సర్కారోడా



మా పొలం మింగినోడా

మా అడవి దోచినోడా

మా బతుకు బుగ్గు చేసి

సిరిసంపదంతా దోచీ

సంచుల్లకెత్తుకోనీ

బండ్లల్ల నింపుకోని

బయలెల్లినావు కొడకో

బయలెల్లినావు కొడకో

బయలెల్లినావు కొడకో

నైజాము సర్కరోడా



చుట్టుముట్టు సూర్యపేట

నట్ట నడమ నల్లగొండ

నువ్వెళ్ళేది హైద్రాబాదు

దానిపక్కన గోలకొండ

గోల్కొండ ఖిల్లా కిందా

గోల్కొండ ఖిల్లా కిందా

గోల్కొండ ఖిల్లా కిందా

నీ ఘోరీ కడతాం కొడకో

నైజాము సర్కారోడా