A collection of great poems written by Dhurjati(ధూర్జటి), one among the Astadiggajas (అష్టదిగ్గజులు) in the court of Sri Krishnadevaraya.
1.
ఏ వేదంబుఁ బఠించె లూత, భుజంగమే శాస్త్రముల్చూచెఁ, దా
నే విద్యాభ్యసనం బొనర్చెఁ గరి, చెంచే మంత్ర మూహించె, బో
ధా విర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు ! మీ పాద సం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళ హస్తీశ్వరా !
తా:
2.
నిన్నున్ నమ్మిన రీతి నమ్మనొరులన్, నీకన్న నాకెన్న లే
రన్నల్దమ్ములు, తల్లిదండ్రులు, గురుం, డాపత్సహాయుండు నా
యన్నా ! యెన్నడు నన్ను సంస్మృతి విషాదాంబోధి దాటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళ హస్తీశ్వరా !
తా:
3.
అంతా మిథ్య తలంచి చూచిన, నరుడట్లౌ టెరింగిన్, సదా
కాంత, ల్పుత్రులు, నర్థమున్, తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిఁ జెంది చరించుఁ గాని; పరమార్థంబైన నీ యందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడుఁ గదా శ్రీ కాళ హస్తీశ్వరా !
తా: