Movie: Raj Kumar
Lyrics: Aathreya
Music: Ilayaraja
దినదినము వర్దిల్లు తెలుగు దేశం...
దీప్తులను వెదజల్లు తెలుగు తేజం...
తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!
మయూరాల వయారాలు మాటలలో పురివిప్పును
పావురాల కువకువలు పలుకులందు నినదించును
సప్తస్వరనాదసుధలు, నవరసభావాలమనులు
చారు తెలుగు సొగసులోన జాలువారు జాతీయం
తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!
అమరావతి సీమలో కమనీయ శిలామంజరి
రామప్ప గుడి గోడల రమనీయ కళారంజని
అన్నమయ్య సంకీర్తనం, క్షేత్రయ్య శృంగారం
త్యాగరాజు రాగమధువు తెలుగు సామగానమయం
తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!